ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అనిశా కి చిక్కిన హాస్టల్ వార్డెన్ ఆమె భర్త
Updated on: 2025-01-31 11:15:00

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది వివరాలు ఇలా వున్నాయి మడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజ్ ప్రాంగణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఝాన్సీ నుండి హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ భర్తతో సహా తను ఉంటున్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు.హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ నుండి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేను అంటూ అనడంతో కనీసం 30,000 ఇమ్మని కోరగా లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వీపర్ ఝాన్సీ ఏలూరు ఏసీబీ ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఎసిబి డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేయడంతో మమ్మల్ని ఆశ్రయించినట్టు గత రాత్రి నిఘా వేసి హాస్టల్ వార్డెన్ నాగమణి మరియు ఆమె భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అనంతరం ఏసిబి కోర్టులో హాజరు పడుతున్నట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం.బాలకృష్ణ,కే.శ్రీనివాస్,రాజమండ్రి సీఐ ఎన్వి.భాస్కరరావు పాల్గొన్నారు.