ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Updated on: 2025-01-28 15:36:00

ఎన్టీఆర్ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మీశ తెలిపారు.నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం,వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందని రెవెన్యూ,ఎన్నికలు,పోలీస్ తదితర విభాగాల సమన్వయంతో ఈవీఎం గోదాము వద్ద నిరంతర పర్యవేక్షణతో గట్టి నిఘా పెట్టినట్లు వివరించారు. తనిఖీలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమౌళి,ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్రెడ్డితో పాటు వై.రామయ్య (టీడీపీ),రాజా(బీజేపీ),ఏసుదాసు (ఐఎన్సీ)తదితరులు పాల్గొన్నారు.