ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Updated on: 2024-12-24 21:23:00
ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్ ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణను సమీక్షించి,సరిహద్దు గ్రామాల పై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.బాల్య వివాహాలు మరియు సాంఘిక దురాచారాలను అడ్డుకునే చర్యలు తీసుకోవాలని,లోన్ యాప్ మోసాలు మరియు సైబర్ నేరాల పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. ముందుగా జిల్లా ఎస్పీకి నూజివీడు డిఎస్పీ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికినారు.అనంతరం సిబ్బంది జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు.పోలీస్ స్టేషన్ మరియు పరిసరాలను సందర్శించి,నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణను లోతుగా పరిశీలించారు.రిసెప్షన్ సెంటర్ మరియు లాకప్ గదులను పరిశీలించి,పోలీస్ స్టేషన్కు వచ్చే పిటీషనర్లతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.పోలీసులు నిర్వహించే ప్రతి రికార్డును సమీక్షించారు.ఆగిరిపల్లి పోలీసులు గతంలో సీజ్ చేసి స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు ఏ నేరాలకు సంబంధించినవో అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులను ఎస్ఐ, సిఐలతో అడిగి తెలుసుకుని,శాంతి భద్రతల పరిరక్షణ మరియు మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కేసుల యొక్క దర్యాప్తులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను త్వరగా చేదించాలని,దర్యాప్తు సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించాలి అనే విషయాల పై అధికారులకు జిల్లా ఎస్పీ అవగాహనను కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిలతో మాట్లాడుతూ ప్రజలకు అతి చేరువుగా ఉండే మీరు ప్రజలకు మెరుగైన సేవలు అందించుట కొరకు గ్రామ సంరక్షణ కార్యదర్శులు పాటుపడాలని,అలాగే రానున్న పండగ రోజులలో మీ మీ ప్రాంతాలలో పేకాట, కోడి పందాలు జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి తెలియచేయాలని, మహిళలు బాలికల యొక్క రక్షణ కొరకు ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అభయ రక్షక దళ సభ్యులకు బస్టాండ్లో వద్ద ఆకతాయిలు వేధింపులకు పాల్పడకుండగా చూడాలని,కోడి పందాలు,పేకాట,క్రికెట్ బెట్టింగ్, నాటు సారా తయారీ మరియు అమ్మకం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అభయ మహిళా రక్షక దళాలను స్కూల్స్,కాలేజీలు,బస్టాండ్ల వద్ద గస్తీ తీరేగేలా మహిళా సిబ్బందిని వినియోగించాలని అధికారులకు ఆదేశించారు.