ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వెర్లను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
Updated on: 2024-12-18 16:05:00

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాలు మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్,భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ల స్వీయ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై తన సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ద్వారకాతిరుమల,భీమడోలు, లక్కవరం, తడికలపూడి,టి.నరసాపురం పోలీస్ స్టేషన్లో పరిధిలలో దొంగిలించిన మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగిలించిన ముగ్గురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.వారు ముగ్గురూ సొంత బావా, బావమరుదులు అయినట్లు,ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్లను దొంగిలించిన తర్వాత జంగారెడ్డిగూడెంలోని ఉక్కుర్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన పాత ఇనుప సామాన్ల కొట్టులో అమ్ముకున్నట్లు నిర్ధారించి,సదరు ఉక్కుర్తి వెంకటేశ్వరరావు వద్ద నుండి సుమారు 539 కేజీల కరిగించబడిన రాగి వైర్ల దిమ్మెలను 100 కేజీల రాగి వైర్లను మొత్తం 639.75 కేజీల రాగిని స్వాధీన పరచుకోని,నిందితుల వద్ద దొంగతనానికి ముందు ఎడ్జ్ ఫీజులను తొలగించుటకు ఉపయోగించే ఇనుప కొక్కెం తోడగబడిన ప్లాస్టిక్ పైపు,రెండు ఇనుప రెంచీలు,నిందుతులు నేరం చేయటానికి వాడిన రెండు బైకులు స్వాదీనపర్చు పరుచుకున్నారు వీటి యొక్క విలువ మొత్తం రాగి విలువ: రూ. 6,39,750 /- అని పోలీసులు తెలిపారు.నేరానికి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలతోపాటు రాగివైరుకొన్న పాత ఇనప సామాల కొట్టు యజమానినీ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.