ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నేటి నుంచి నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు
Updated on: 2024-12-18 09:34:00

ఏలూరు జిల్లాలో నేటి నుంచి 23 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ డీఆర్వో ఛాంబర్లో ఎపీపీఎస్సీ అధికారులు,పోలీస్,విద్యుత్, వైద్యశాఖ,పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు,లైజన్ అధికారులతో పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వట్లూరు,ప్రభుత్వ ఐటిఐ రోడ్డులోని సిద్ధార్ధా క్విస్ట్ సిబిఎస్ సి స్కూలు,వట్లూరులోని సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో నేటి నుంచి 23 వరకు ఆఫ్ లైన్,ఆన్ లైన్ విధానంలో ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయన్నారు
.పరీక్షలు ఉ. 10 గంటల నుంచి మ. 1 గంట వరకు,మరియు మధ్యాహ్నం 3గం.నుంచి 6 గంటల వరకు జరుగుతాయని ఆబ్జెక్ట్ పరీక్షలు గంట ముందుగానే ముగుస్తాయని తెలిపారు.అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.ఉదయం పరీక్షకు 8.30 గం. నుంచి 9.15 గం. వరకు,మధ్యాహ్నం పరీక్షకు 1.30 గం. నుంచి 2.15 గం. లోగా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు.గ్రేస్ పిరిడ్ ను పరిగణలోకి తీసుకొని ఉదయం 9.30 గం. లోపు మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటలకు సెంటర్ గేట్ మూసివేయబడుతుందని తెలిపారు.గేట్ను మూసివేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులకు ప్రవేశం ఉండదన్నారు
.అభ్యర్ధులు తమతోపాటు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాలని లేదంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదని ఆయన స్ఫష్టం చేశారు. అనుమతి పొందిన దివ్యాంగులు స్క్రైబ్ ను తామే తెచ్చుకోవాలన్నారు.రాత పరీక్షకు ఎపిపిఎస్ సి నుంచి అనుమతి ఉన్న బేర్ యాక్ట్ పుస్తకాలు మాత్రమే తీసుకురావాలని,ఇతర పుస్తకాలకు,జీరాక్సా కాపీలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.అభ్యర్ధులు తమతోపాటు సెల్ ఫోన్లు,స్మార్ట్ వాచ్ లు ఇతర ఏవిధమైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వీటిని అభ్యర్ధులు తీసుకురావద్దని సూచంచారు.పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించడం జరుగుతుందని పోలీస్ బంధోబస్తు ఏర్పాటు చేశామని త్రాగునీరు,మరుగుదొడ్ల సదుపాయం ఉండేలా చూడాలన్నారు.విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని,వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు.లైజనింగ్ అధికారులు,ఛీఫ్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంతంగా,సజావుగా పరీక్షలను పూర్తిచేయాలని డిఆర్ఓ సూచించారు.ఈ పరీక్షలకు మొత్తం 1037 మంది అభ్యర్ధులు హాజరవుతారన్నారు.