ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ట్రిపుల్ ఐటీ నూజివీడు మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులు ‘కె.సి.పి ఇంజనీర్స్ ప్రై. లిమిటెడ్’ కంపెనీ ఉద్యోగానికి ఎంపిక
Updated on: 2024-12-16 17:00:00

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు నీలపు.శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి,కె.హేమలత,కె.మమతాంజలి,వై.మంజుల మద్రాసుకు చెందిన కె.సి.పి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.నేటి విద్యార్థులందరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వైపే పరిమితమవడం కాకుండా,కోర్ ఇంజనీరింగ్ బ్రాంచిలలో కూడా మెరుగైన అవకాశాలున్నాయని తెలుసుకోవాలన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మెటలర్జీ విభాగ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి,ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారని డైరెక్టర్ తెలియజేసారు.ఈ సంవత్సరం వంద శాతం ఉద్యోగాల కల్పనతో మెటలర్జీ విభాగం విద్యార్థులు ముందంజలో ఉన్నదని తెలియజేసారు.దేశానికి మెటలర్జీ విభాగంలో ఉదోగార్థుల కొరత ఉందనీ,ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ, విభాగాధిపతి డాక్టర్.బి. వెంకటేశ్వర్లు తెలియజేసారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా నూజివీడు మెటలర్జీ విభాగ విద్యార్థులు రాణించి,అవకాశాలను అందిపుచ్చుకుని స్థిరపడ్డారని తెలియజేసారు.