ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేసిన కొయ్యలగూడెం పోలీసులు
Updated on: 2024-12-03 09:15:00
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పి,సిఐ ల స్వీయ పర్యవేక్షణలో అర్ధరాత్రి కోయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ కి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి గవరవరం గ్రామం శివారులో కోడి పందాలు స్థావరం పై దాడులు నిర్వహించి 20 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,23,130 రూపాయలను 05 మోటార్ సైకిల్ లను మరియు 02 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని వారి పై కోయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా కొయ్యలగూడెం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందెలు పేకాట లు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడి పందెలు,పేకాటలో నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా కోయ్యాల గూడెం ఎస్సైగారి యొక్క ఫోన్ నెంబర్ 9440796666 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరుల పై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆన్నారు.