ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Updated on: 2024-11-19 07:29:00

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 16, 18, 21, 22వ వార్డులో రూ.1.70కోట్ల డిఏంఎఫ్ నిధులతో చేపట్టనున్న నిర్మాణం పనులకు శంకుస్థాపన, 17, 19వార్డుల్లో రూ.2.20కోట్లతో పూర్తయిన నిర్మాణాలనుకొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి సారించామని, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డుల్లో వివిధ పథకాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని, ప్రజలకు గెలుపు ఫలాలు అందించడమే లక్షంగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.