ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు
Updated on: 2024-10-10 18:59:00

పారిశ్రామిక దిగ్గజం మానవతా మూర్తి విలువలతో కూడిన వ్యాపారవేత్త రతన్ టాటా గారని, రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందిని శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి కొండబాబు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి రతన్ టాటా ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందారని, గొప్ప మానవతా మూర్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ముఖ్యంగా కరోనా సమయములో భారీ విరాళం అందించారని, స్థిరమైన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరిచారని, వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశారని, దూర దృష్టితో ఆలోచించి వ్యాపార రంగంలో అడుగులు వేసి సక్సెస్ సాధించారని, ప్రపంచ వ్యాప్తంగా 100 కుపైగా దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన రతన్ టాటా ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా మరేందరికో ఉపాధికి కారకులయ్యారని, కష్టపడే తత్వం సేవా దృక్పధం ఆయన స్థాయిని పెంచాయిని, టాటా కంపెనీ అంటే ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించారని, రతన్ టాటా మృతి యావత్ భారతదేశాన్ని కదిలించిందని, భారతదేశం గొప్ప వ్యాపారవేత్తని మానవతా మూర్తిని కోల్పోయిందిని తెలిపారు.