ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్-2024
Updated on: 2024-10-06 15:38:00
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్-2024 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం సిఎం కప్ ర్యాలీ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా స్థానిక మంచిర్యాల చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ లతో కలిసి ఆమె ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టిఆర్ మినీ స్టేడియం వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నిర్మల్ పట్టణానికి వచ్చిన టీం సభ్యులు రాష్ట్రంలోని 33 జిల్లాలలో పర్యటిస్తారని అందులో నిర్మల్ నాలుగవ జిల్లా కావడం విశేషం అని అన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడాకారులను ప్రోత్సహించేందు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్రామీణ యువత క్రీడాకారులుగా రాణించేలా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో క్రీడలను నిర్వహించడం జరుగతుందన్నారు.
అనంతరం స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జి. ఈశ్వర్, డి.వై.యస్.ఓ బి. శ్రీకాంత్ రెడ్డి, పెటా ప్రెసిడెంట్ భూక్య రమేష్, ఒలంపిక్ సంఘ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాద్యాయులు, క్రీడాకారులు, అధికారులు, యువత, తదితరులు పాల్గొన్నారు.