ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అజాతశత్రువు సీతారాం ఏచూరి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-09-12 21:19:00

సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. రాజకీయాల్లో సీతారాం ఏచూరి అజాతశత్రువుగా నిలిచారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. అత్యంత మేధోసంపత్తి కలిగిన నాయకుడని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజా యోధుడిని కోల్పోయిందన్నారు. ఏచూరి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.