ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆయిల్ ఫామ్ సాగు పై రైతులు దృష్టి సారించాలి
Updated on: 2024-08-27 22:40:00
తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కపిలేశ్వర పురానికి చెందిన సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జి ఎమ్ పి. వీరభద్రరావు,అధికార ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫాం సాగు ఉపయోగాలు మార్కెటింగ్ తదితర అవకాశాలు గురించి వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేసత్యానందరావు మాట్లాడుతూప్రకృతి వైపరీత్యాల వల్ల వరి, అరటి తదితర పంటలు తరచూ పంట నష్టానికి లోనై కర్షకులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సందర్భంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సందర్భంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు మంచి అవకాశంగా కనిపిస్తుందన్నారు. నూనె గింజల ఉత్పత్తికి దేశంలో అధిక డిమాండ్ ఉండడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 30,35 సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టడం మంచిదన్నారు. దేశ ప్రజల అవసరాలకు రెండున్నర లక్షల టన్నుల ఆయిల్స్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా మనదేశంలో 40 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నామని మిగతాదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కపిలేశ్వరపురం సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ ఫామ్ సాగు అంశంలో రైతులను ప్రోత్సహించడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు. ప్లాంటేషన్, మార్కెటింగ్ తదితర అంశాల్లో వారి సహకారం రైతులకు పూర్తిగా లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సైతం డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలకు సబ్సిడీ అందించడంతోపాటు, ఎన్ ఆర్ జి ఎస్, ఉద్యాన శాఖ అనుసంధానంగా ఉన్న పథకాలను సైతం రైతులు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ), ముత్తాబత్తుల రాజు,కరుటూరి నరసింహారావు, ముళ్ళపూడి భాస్కరరావు, కరుటూరి వరప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.