ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకం
Updated on: 2024-08-27 22:28:00

జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకమని వారి కృషి మరువలేనిదని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో మంగళవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 25వేల కు పైగా క్రియశీలక సభ్యత్వాల నమోదు కావడం తో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగిందన్నారు. జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం ఆత్రేయపురం జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.