ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
డయల్ 100 పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా ఎస్పీ
Updated on: 2024-08-17 17:25:00

బేసిక్ పోలీసింగ్పై శ్రద్ధ పెట్టాలి డయల్ 100 ను పటిష్టం చేయాలి . డ్రగ్స్ ఫ్రీ జిల్లా గా తీర్చిదిద్దాలి నేరాలపై ఇన్స్పెక్టర్లు , డిఎస్పీ లు రివ్యూలు చేరాలని జిల్లా ఎస్పీ జానకి శర్మ అధికారులను ఆదేశించారు సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని . దొంగతనాలు జరుగకుంటా పెట్రోలింగ్ వ్యవస్తను పాటిష్ట పరచాలన్నారు. జిల్లాలో పని చేస్తున్న కానిస్టేబుల్ స్టాయి నుండి ఏఎస్పీ స్టాయి వరకు జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఈ రోజు నిర్వహించిన రేడియొ సెట్ ద్వారా సమీక్షా సమావేశం ఎస్పీ డా. జానకి షర్మిల ఐ. పి. ఎస్ నిర్వహించారు.. పోలీసులకు డి.జి.పి డా.జితేందర్ ఆదేశాలను , సూచనలను వివరించారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉండాలని, ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన పోలీసులు, అనైతిక చర్యలకు పాల్పడితే, క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ హెచ్చరించారు. రాబోవు పండుగలు అయిన వినాయక చవితి సందర్బంగా ముందస్తుగా అన్నీ కమిటీలతో చర్చించి గణపతి విగ్రహం ప్రతిస్తాపన నుండి నిమజ్జనం వరకు జరిగే కార్యక్రమాల గురుంచి బద్రత పరమైన చర్యల నిమిత్తం వారితో చర్చించాలి. జిల్లాలో గణపతి విగ్రహాలను ప్రతిస్తాపన చేసే ప్రదేశాలను ఇప్పటి నుండే దనర్సించాలని సూచించారు. జిల్లా పోలీసు అధికారులు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవరించాలని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పి అవసరమైతే అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన పేకాట,గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.