ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
విజయ హై స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్
Updated on: 2024-08-17 17:19:00

విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి రాజుల వారి దిగంబర్ (ఏకలవ్య ఫౌండేషన్ మెంబర్) మాట్లాడుతూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిదీ అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు . దేశ రక్షణ కి ప్రేరణ రక్షా బంధన్అని తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ టి. కె. వి రామానుజాచార్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. పూర్వం రక్షకట్టి వేదాలు నేర్పే వారని మనందరం దేశాన్ని రక్షించుకోవాలని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష అని తెలిపారు. పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు "రక్ష "కట్టారు. ఈ కార్యక్రమంలో గొల్ల వెంకటేశ్వర్ మంచిరాల నాగభూషణం , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.