ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతికి ప్రణాళికలు : ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-08-12 21:09:00

కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతి ప్రణాళిక రూపొందించి, గత వైసిపి ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ తుమ్ములను దోచుకున్న ద్వారంపూడి పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మిన్సిపల్ కమీషనర్ బావన ఐ.ఏ.ఎస్ ను కలిసి గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ విధంగా లూటి చేశారో అన్ని అంశాలను ఆధారాలతో సహా అందజేసి విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా కేవలం ప్రజలు కట్టిన పన్నులు వందల కోట్ల రూపాయిలు దోచేసాడని, కాకినాడ అభివృద్ధి గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోనే అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే తన పదవీకాలం అంతా అధికారం అడ్డు పెట్టుకుని గతంలో చేసిన ప్రగతి పనులకు తిరిగి బిల్లులు చేయించుకుని కోట్ల రూపాయిలు తన స్వంత ఖాజానాకు తరలించుకుపోయాడని పేర్కొన్నారు. ప్రజలు కట్టే పన్నులు సొమ్ములను దుబారా చేయకుండా కేవలం కాకినాడ నగర అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని, ప్రధానంగా డ్రైన్లు నిర్వహణ, పారిశుధ్య పర్యవేక్షణ, విద్య, వైద్యం, విద్యుత్ అంశాలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. తన హయాములో కాకినాడ అభివృద్ధి ఎలా ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారో అవిధంగా అభివృద్ధి ప్రజలకు అందించే విధంగా నూతన కార్యాచరణ రూపొందిస్తున్నట్లి సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఆయన వెంట తెదేపా నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గుమ్మల్ల చిన్నా తదితరులు ఉన్నారు.