ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన శాంతినగర్ కాలనీవాసులు
Updated on: 2024-08-05 13:33:00
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే తమ కాలిని సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ముందు ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు