ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు..అధికారులందరూ వరద సహాయక చర్యలలో నిమగ్నం- జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
Updated on: 2024-07-28 12:23:00
గోదావరి పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా, మండల గ్రామ స్థాయి అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది అందరూ సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున జూలై 29 సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) కార్యక్రమం రద్దు చేయబడింది' అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు