ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రుణమాఫీ నిధులు విడుదల ఈరోజే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Updated on: 2024-07-18 07:37:00
ప్రతి మండలంలో భారీ ఎత్తున రుణమాఫీ సంబరాలు, హాజరుకానున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ హామీను నిలబెట్టుకునే క్రమంలో మూడు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్న మాఫీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం ,ఆ ప్రక్రియలో భాగంగా నేటి సాయంత్రం నాలుగు గంటల లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు, ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం కేవలం 28 వేల కోట్ల రూపాయల మాత్రమే మాఫీ కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో ఈ ఒక్క సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.