ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Updated on: 2024-07-16 08:13:00

కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అమలు చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం లో 395 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను ఆయన అందించి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అధికారులు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు అందిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఏనాడూ వివక్ష చూపదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, మహిళల చేతిలో విద్యా వ్యవస్థ ఉంటే బలపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అందుకే పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు పాఠశాల విద్యా కమిటీ లను, మరియు పాఠశాల మరమ్మతులు చేయడం కోసం మహిళా సంఘాలకు అప్పజెప్పారు అని ఆయన చెప్పారు.
మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా 270 కోట్ల తో డ్రైనేజ్ మరియు సిసి రోడ్ల కోసం శంకుస్థాపన చేశారు అని గుర్తు చేశారు. 37 కోట్ల తో పట్టణం లో. అత్యవసరమైన డ్రైనేజీ వ్యవస్థ పనులు చేయుటకు నిధులు మంజూరు జరిగాయని, మరో 40 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తాం అని, 600 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఈ సంవత్సరమే సుమారు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి మన పట్టణం లో చేసుకొనే అవకాశం ఉంది అని ఆయన చెప్పారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లకు, చైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వండం జరిగింది అని వారి వార్డుల్లో వారే సమస్యలు పరిష్కారం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, అందుకే బస్సుల్లో ఉచిత ప్రయాణం తో పాటుగా గృహ వినియోగదారుల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతోనే వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత కనీసం రెండు మూడు చెట్లైనా నాటాలని అని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ పట్టణం లో ఈ సంవత్సరం 50 వేల మొక్కలు నాటాలి అనే లక్ష్యం నిర్ణయం తీసుకొన్నాం అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, తాహసిల్దార్ గాన్సీరాం నాయక్ , టి పిసిసి ప్రదాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బి. సుధాకర్ రెడ్డి, ఫయాస్, టంకర కృష్ణయ్య యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ , ఆజ్మత్ ఆలి మరియు పట్టణ కౌన్సిలర్లు, అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు.