ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించండి - నీటిపారుదల శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ఎమ్మెల్యేలు
Updated on: 2024-07-16 08:04:00

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు తదితర ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు కలిసి మంత్రికి విజ్ఞాపన చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణంతో షాద్ నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు నియోజకవర్గ ప్రజలు సాగు కష్టాలను తీర్చవచ్చని తెలియజేసి నిధుల మంజూరుకు ఒప్పించడం జరిగిందని వారు మీడియాతో పేర్కొన్నారు.
మొబైల్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రహదారిలో ఓ మొబైల్ షాపును స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ తదితరులు ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి వైపు దూసుకుపోవాలని వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. యువత ఆర్థిక రంగం వైపు దృష్టిసాదించడం మంచి పరిణామం ఈ సందర్భంగా మొబైల్ నిర్వాహకులను అభినందించారు.