ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
గుండ్లకమ్మ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలి జిల్లా కలెక్టర్
Updated on: 2024-07-12 18:59:00

మద్దిపాడు జూలై 12 గుండ్లకమ్మ రిజర్వాయర్ చివరి ఆయకట్టు రైతులకు తక్షణం సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అమీము్ అన్సరియా అన్నారు శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్ను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలన్నారు.12 గేట్లు ను సైట్ ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లకు సాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ ను వెల్లడించారు. పనులు జాప్యం లేకుండా చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు కింద నీటి సరఫరా భూ సేకరణ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇరిగేషన్ ఎస్సీ నాగ మురళీమోహన్ కలెక్టర్కు వివరించారు. కుడి కాలువ క్రింద 28 వేల ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినట్లు కలెక్టర్కు తెలిపారు. ఎడమ కాలు క్రింద భూసేకరణకు సమస్యలు తలెత్త డంతో వర్క్ ఆర్డర్ ను ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్కు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో జీవి సుబ్బారెడ్డి తాసిల్దార్ అనురాధ ఇరిగేషన్ డి ఈ కే నాగరాజు ఏఈ వై రామాంజనేయులు రెవిన్యూ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.