ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ఔదార్యానికి అభినందనలు.. ఎమ్మెల్యే కొండబాబు..
Updated on: 2024-07-10 17:39:00

కాకినాడ... ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రధాయినిగా బాసిళుతున్న కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో పరిమితికి మించి రోగుల తాకిడి పెరుగుతున్న నేపద్యంలో రోగులకు వైద్య సేవలు అందిం చడం కష్టతరంగా మారింది. 11వందల మంది రోగులకు ఇన్ పెషేంట్ గా జాయిన్ చేసుకుని వారికీ వైద్య సేవలు అండీంచెందుకు మాత్రమే సౌకర్యలు కలిగి ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం సుమారు 18వందల నుండి 2వేల వరకు రోగులకి వైద్యలు సేవలు అండీస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కొన్ని సమయాల్లో రోగులు అసహనానికి గురవ్వుతున్న సందర్భలు అనేకం ఉన్నాయి. అయితే జిజిహేచ్ కు పెరుగుతున్న ఒత్తిడికి అనుగుణంగా 500 మంది రోగులకు సరిపడేవిధంగా ఆధునిక వసతి, పడకలు, మా్లిక సదుపాయల కల్పనతో ప్రత్యేక విభాన్ని నిర్మించెందుకు ముందుకు వచ్చిన రాంకోనా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ లో డాక్టర్ పట్టా పొంది అమెరికా లో స్థిరపడిన పూర్వ విద్యార్డులు తమ స్వంత నిధులు సమాకూర్చి నిర్మాణం చేయించడం అభినందనీయం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. బుధవారం ఆయన జీజీహేచ్ కు చేరుకొని సూపరిం టెండెంట్ ఎస్ లావణ్య కుమారి చాంబర్లో వైద్యలు, పరిపాలన అధికారులతో జిజిహేచ్ ప్రగతి, అభివృద్ధి పై సమీక్షించ్చారు. అనంతరం సూపరింటీండెంట్ లావణ్య కుమారితో కలిసి నిర్మాణం లో ఉన్న ఎం సి హెచ్ బ్లాక్ ను సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మీడియా తో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ బిల్డింగ్ ప్రవాస ఆంద్రులైన రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ సొంత నిధులతో ఇంత పెద్ద భవనం నిర్మాణం చేపట్టడం పట్ల వారికున్న అభిమానం తెలియజేస్తుందాన్నారు. వారు అమెరికా లో స్థిరపడినా తాము చదువుకున్న ఆసుపత్రి అభివృద్ధికి సాయం చేయాలనే దృక్పధం వారిలో ఉన్న సమాజం పట్ల గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్టైతే మాతాశిశు విభాగంలో గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన సేవలు అందించెందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంతోమంది ఇతర జిల్లాల నుండి వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నావారికి ఇంకా మంచి వైద్య సేవలు అందించడానికి దాతల అవసరం ఎంతైనా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ విద్య, వైద్య రంగాలా అభివృద్ధికి ప్రధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సి ఎస్ ఆర్ ఎం ఓ డాక్టర్ అనిత, ఏ ఒ అనురాధ, డిప్యూటి కలెక్టర్ శ్రీధర్, ఇంజనీరింగ్ డి ఈ చక్రవర్తి, సివిల్ ఇంజనీర్ రాహుల్, వర్క్ షాప్ గ్రేడ్ 2 మెకానీక్ సురేంద్ర, రామ్కోనా ప్రతినిధులు డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ ఆనంద్, డాక్టర్ చిట్ల కిరణ్, కాంటాక్టర్ సురేష్, గోకేడ శ్రీరామ చంద్రముర్తి, తదితరులఉన్నారు