ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కూటమి ప్రభుత్వం లో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-07-10 17:35:00
కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో RMC పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మిస్తున్న మాత శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని, రామ్ కానా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిరక్షణలో బిల్డింగ్ పనులు చేయడం జరుగుతుందనని, రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా సహకారంతో రూ.30 కోట్లుతో బిల్డింగ్ నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందని, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.
1150 పడగల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలో సరిపోవడం లేదని, నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే 500 పడకలు గర్భిణీ చిన్నారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు, డాక్టర్ లావణ్య కుమారి, రామ్ కానా... రాంకోస సభ్యులు డాక్టర్ చిట్లకిరణ్ కుమార్, డాక్టర్ తేజో కృష్ణ, డా. అరుణ ఆదిత్య, డా ఆనంద్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణణ, మల్లిపూడి వీరు, నల్లూరి శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, మల్లాడి గంగాధరం తదితరులు పాల్గొన్నారు.