ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఉచిత ఇసుక పాలసీ-రాష్ట్ర ప్రగతికి బాట : కాకినాడ జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్
Updated on: 2024-07-08 19:39:00

నెరవేరనున్న పేదల సొంతింటి కల-ఊపందుకోనున్న నిర్మాణ రంగం.
* ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యుల భారీ ఊరట లభించింది. * ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి నెల రోజుల లోపే అమలలోకి తేచ్చారు. * ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం ...బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది. * నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానం. పారదర్శకత, ముందుచూపుతో శాండ్ పాలసీని రూపొందించడం జరిగింది. ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన జగన్ రెడ్డి: * గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపింది. ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారు. వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురు అవతారం ఎత్తి దోచుకున్నారు. * పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఖర్చు అయితే అందులో ఇసుక కొనడానికే రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేశారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్ధం చేసుకోవచ్చు.
ఇసుక పాలసీ అమల్లో నిరంతర పర్యవేక్షణ:....అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. * సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాం. * జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.