ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మీకోసం అర్జీలు సత్వరం పరిష్కరించాలి
Updated on: 2024-06-24 14:40:00

శ్రీకాకుళం: మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు సత్వరం ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 148 అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జెడ్పి సిఇఓ డి.వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పి.డి చిట్టి రాజు, డిసిహెచ్ఎస్ డా.రాజ్యలక్ష్మి, హౌసింగ్ పి.డి గణపతి రావు, ఇరిగేషన్ ఎస్.ఇ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.