ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి -జిల్లా కలెక్టర్
Updated on: 2024-06-22 15:06:00
శ్రీకాకుళం: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జీలాని సమూన్ ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. L కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. డి.పి.ఎం.ఓ సహచర అధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించాలని ప్రతీ అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం చేపడుతున్న పనులు, జిల్లా మాస్ మీడియా అధికారి నిర్వహించే పనులపై ఆరాతీశారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పనితీరు మాస్ మీడియా అధికారి వివరించారు. స్కాన్ సెంటర్ మోనేటరింగ్, హేండ్ క్లినింగ్ అంశాలపై హెల్త్ ఎడ్యుకేటర్స్ చేపడుతున్న పనులపై జిల్లాలో ప్రసవాల ఎన్ని జరుగుతున్నాయి అందులో సాధారణ, శస్త్ర చికిత్స ప్రసవాలపై వివరణ కోరగా డి.ఎం.అండ్.హెచ్.ఓ వివరించారు. అలాగే డయేరియా నివారణకు చేపడుతున్న పనులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా బి.మీనాక్షి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో స్టాప్ డయేరియా నిర్వహించడం జరుగుతుందన్నారు. లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకొని అంగన్వాడీలకు, ప్రతీ ఇంటిని సందర్శించి డేటా తీసుకోని, డయేరియా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆశాడే రోజున అన్ని అంశాలపై శిక్షణా ఇవ్వాలని, చేతులు, పరిసరాలు శుభ్రపరచుకోవడంపై ఆశాలు, ప్రజలకు అవగాహనా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీటికి సంబంధించి పైప్ లైన్ లో ఎటువంటి సమస్యలు ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరిచేసిన అనంతరం అలాగే పంచాయితీ శాఖ పరిశీలించి క్లోరినేషన్ అనంతరం చేసిన అనంతరం మరోసారి త్రాగునీటి పరీక్షించాలన్నారు. డయేరియా కేస్ గుర్తించిన వెంటనే మొదట చేపట్టవలసిన పనులలో భాగంగా జిల్లా కలెక్టర్ వారికి సమాచారం అందించాలన్నారు. అనంతరం సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం చేర వేసి సత్వరచర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి.మీనాక్షి, డి.ఐ.ఓ ఐ. రాజేశ్వరి, ఉప వైద్య ఆరోగ్య అధికారి ఎం ప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శాంతిశ్రీ, ఎపిడిమిలోజిల్ డా పి.సుజాత, డిపిఎంఓ డా. జి.వి.లక్ష్మి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.ప్రకాష్ రావు, డిఎంఓ సత్యనారాయణ, ఆర్. బి ఎస్ కె కోఆర్డినేటర్ సి.పి శ్రీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఎస్.ఓ రామ్ నాగేశ్వరరావు, డి.పి.హెచ్.ఎన్.ఓ శైలజా మాధవ్, డిస్ట్రిక్ట్ బ్లడ్ కంట్రోల్ ఆఫీసర్ డా. త్రినాధ రావు తదితరులు పాల్గొన్నారు.