ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఘనంగా జరిగిన యోగా దినోత్సవం
Updated on: 2024-06-21 13:05:00

యోగాతో మానసిక, శారీరక ఒత్తిడులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు అన్నార అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసులు శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, నిరంతర సాధన చెయ్యాలని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని, యోగాతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. యోగా వలన నూతనోత్తేజం లభిస్తుందని, దీనివలన మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ శ్రీకాకుళం , సీనియర్ మెడికల్ ఆఫీసర్, మాట్లాడుతూ, ఆయుష్ శాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ ఆదేశాల మేరకు, యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని, యోగా వలన బిపి,సుగర్, మూనసిక రోగాల నుండి దూరం చేసుకోవచ్చని తెలియజేసారు.