ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి ... ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
Updated on: 2024-06-14 06:58:00
బాపట్ల: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పురపాలక సంఘం అధికారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు తోలి రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు అధికారులు తీవ్ర కృషి చేయవలసిన బాధ్యత ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడానికి అధికారులు ముందుకు వెళ్లాలని సూచన చేశారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పురవీధులన్నీ పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేసే ప్రజలకు జవాబుదారులుగా నిలవాలని సూచనలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి రోజూ డ్రైనేజీలను పరిశుభ్ర పరుస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అన్ని వార్డులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళుతున్నానని వివరించారు.పారిశుధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు,అధికారుల నివాసాలలో పనులకు పంపించకుండా ఉండాలని ప్రభుత్వ జీతాలు ఇస్తూ అధికారుల నివాసాలలో ప్రజాప్రతినిధుల నివాసాలలో పనులు చేయిస్తే సహించేది లేదన్నారు. స్వయంగా ప్రతి ఒక్క పాశుద్ధ్య కార్మికుడితో తాను మాట్లాడతానని పాశుద్ధ్య కార్మికుల సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన చేసి ప్రభుత్వానికి మంచి పేరు అధికారులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.