ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
10 నుండి ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు :డీఐఈఓ
Updated on: 2024-06-08 19:47:00

10న ఆంగ్లం ప్రాక్టికల్స్, 11న పర్యావరణం, 12 నైతిక పరీక్షలు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇంటర్మీడియేట్ కళాశాలల్లో ఈ నెల 10 నుండి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలియజేసారు. సంబంధిత పరీక్ష వివరాలు తెలియజేసారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ప్రథమ సం. వార్షిక పరీక్షల్లో గైర్హాజరైన, అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సప్లమెంటరీ పరీక్ష ఉంటుందని ఈ నెల 10న సోమవారం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ సబ్జెక్టుకు, 11 వతేదీ మంగళవారం న పర్యావరణ విద్య, 12 వ తేదీ బుధవారం న నైతిక విలువలు, మానవత పరీక్ష (రెండవ సం. విద్యార్థులకు మాత్రమే) నిర్వహించబడును. ఈ పరీక్షలకు అర్హులైన విద్యార్థుల జాబితాలు సంబంధిత కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని, పరీక్ష నిర్వహించడానికి కావల్సిన సమాధాన పత్రాలు జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంనుండి తీసుకొని బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించి, మూల్యాంకనం అనంతరం ఆన్ లైన్ లో మార్కుల నమోదు చేయాలని అన్నారు. ఈ పరీక్షలకు గాను జిల్లా వ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కు 363 మంది, పర్యావరణ విద్యకు117 , నైతికత, మానవ విలువల పరీక్ష కు 7 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులకు సకాలంలో సమాచారాన్ని అందించి పరీక్ష నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.