ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అధినేత చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-06-06 18:44:00

హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఏలూరికి అభినందనలు తెలిపిన నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అద్భుతమైన ఘనవిజయం సాధించడం పట్ల అధినేతకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యువ నేత నారా లోకేషను కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీలో రికార్డు బద్దలు చేయడం పట్ల లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ అపార అనుభవం ముందుచూపుతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.