ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఇకనుండి ధర్మవరం అభివృద్ధి బాధ్యత నాది- - ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-06-05 19:04:00

ధర్మవరం , జూన్ 5 : సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ముమ్మాటికి ధర్మవరం ప్రజల గెలుపేనని ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ ను అభినందనలు తెలియజేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయానికి బుధవారం వేలాది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుండి బిజెపి టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలలు , పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్య కుమార్ కు అభినందనలు తెలిపారు. వేలాది ప్రజలు గుమి కూడడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు కేతిరెడ్డి అరాచక పాలనలో అభివృద్ధికి దూరమైన ధర్మవరం నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా రాక్షస రాజ్యానికి అంతం పలికారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా అరాచకాలు కబ్జాలు రౌడీయిజం వల్ల కష్టాలు పడిన ప్రజలు ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు.