ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పాత్రికేయుడు సుబ్బారావుకు అవార్డు రావడం గర్వకారణం
Updated on: 2024-05-31 14:42:00

ప్రముఖ పాత్రికేయుడు పులుసు వీర వెంకట సత్య సుబ్బారావుకు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీ.హెచ్.పీ.యూ) గౌరవ డాక్టరేట్ భారత కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించడం కొత్తపేట నియోజకవర్గానికే గర్వకారణం అని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం నందు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, నాటక కళాకారుడిగా, పాత్రికేయుడిగా సుబ్బారావు అందరికీ సూపరిచితులు అని, ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణం అని చిర్ల కొనియాడారు.ఈ మేరకు ఆయన అందుకున్న ధృవ పత్రాలు మెడల్ లను చిర్ల పరిశీలించి సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించారు. సుబ్బారావు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్, సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సఖినేటి వాకులరాజు, కొల్లి శ్యాంసన్, బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.