ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
Updated on: 2024-05-31 13:01:00
అసలే రోహిణి కార్తె, ఒక పక్క ఉక్కపోత ఆపై వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కాబట్టి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కొత్తపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వేళాపాళాలేని కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రాత్రివేళలో మరీ ఎక్కువుగా ఉంటుందని వాపోయారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా పూర్తి స్దాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.