ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది - సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-30 19:24:00

ధర్మవరం, మే 30 : ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న కొద్ది వైసీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోతోందని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో గురువారం కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఓట్ల లెక్కింపు విషయమై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు సూచనలు ఇచ్చారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిసిపోయిందని అందుకే ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పిస్తున్నాడని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మే 13న వైసిపి ఓటమిని నిశ్చయించారని జూన్ 4న ఫలితాల ద్వారా వైసిపి ఓటమిని పరిపూర్ణం చేయబోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే అక్కసుతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 15 రోజుల్లో 8 మంది రైతులు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుని కష్టాల్లో ఉంటే సీఎం విదేశీ పర్యటనల్లో వినోదాల్లో మునిగితేలుతుండడం బాధాకరమన్నారు. వైసిపి అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు రానున్నాయని, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ఎన్నికల్లో విజయం సాధించబోయి ఎన్ డి ఏ కూటమి తీసుకోబోతుందని ఆయన చెప్పారు.