ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ధర్మవరం డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు
Updated on: 2024-05-27 10:55:00

ధర్మవరం ఆర్టీసీ డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇటీవలే రావడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల తాత్కాలిక అవసరాల దృష్ట్యా బీహెచ్ఈఎల్ కు, సికింద్రాబాద్కు, హైదరాబాదుకు పంపడం జరుగుతుందని తెలిపారు. మరొక బస్సు శని, ఆదివారాలలో ప్రత్యేకంగా దూరప్రాంతాలకు పంపడం జరుగుతోందని తెలిపారు. జూలై నెలలో 25 బస్సులు జిల్లాకు రానున్నాయని, అదేవిధంగా కొత్త బస్సులు కూడా ధర్మారం డిపోకు రానున్నాయని తెలిపారు. ప్రయాణికుల సుఖ ప్రయాణము కొరకు కొత్త బస్సులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం డిపో నుంచి అనేక బస్సులు వివిధ దూర ప్రాంతాలకు, జిల్లాలలో సర్వీసులు నడుస్తున్నాయని. ప్రయాణికులకు ఎక్కడ ఏదైనా సమస్య ఎదురైతే ధర్మవరం డిపో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సంక్షేమమే మా ఆర్టీసీ దేయమని వారు తెలిపారు.