ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం
Updated on: 2024-05-26 03:56:00

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది.వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు,బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు.కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు,స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది.గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు..ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది.పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది.జీవితమే మారిపోయింది.కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడికి పొలంలో ఓ వజ్రం దొరకగా పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు,రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు. అయితే బయట మార్కెట్లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.