ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న టపాసులు సీజ్
Updated on: 2024-05-25 17:30:00
ఈ రోజు అనగా 25-05-2024 వ తేదీ ఉదయం ముదిగుబ్బ UPS సీఐ శ్రీ P.యతీంద్ర గారికి టపాసుల అక్రమ నిల్వల గురించి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు ముదిగుబ్బ టౌన్ కు చెందిన సోమల నాగార్జున, వయసు 43 స.లు, S/o S.వజ్రగిరి నాయుడు అను వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి ఉండి పోలీసులు తనిఖీలు చేస్తారని అప్రమత్తం అయ్యి తాను నిల్వ ఉంచిన టపాసులను మరో చోటకి తీసుకుని పోతుండగా ముదిగుబ్బ HP పెట్రోల్ బంక్ వద్ద అతని వద్ద నుండి మొత్తం సుమారు రూ. 1,46,210/- లు విలువ చేసే టపాసులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరైనా నియమాలను ఉల్లంఘించి టపాసులు అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేసిన యెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.