ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Updated on: 2024-05-25 08:29:00

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగులమందులు అమ్మితే సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి దుకాణం ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను రోజువారీగా రిజిష్టర్లలో పొందుపరచాలని చెప్పారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపరుచుకోవాలని, ఒకవేళ రైతు నష్టపోయినట్లయితే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, డీలర్లు, ఫెర్టిలైజర్స్ యజమానులు పాల్గొన్నారు.