ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మహబూబ్నగర్ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు...
Updated on: 2024-05-22 21:32:00

కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై మరియు పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లపై లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది ముఖ్యంగా హషిం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో ప్యాకేజీలపై ముద్రవించవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ నెట్ క్వాంటిటీ ఎంఆర్పి మరియు తయారు తేదీ కన్స్యూమర్ కేర్ నెంబర్ కన్జ్యూమర్ కేర్ అడ్రస్ వంటి వివరాలు ముద్రించని ప్యాకేజీలు ఉండటం గమనించి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పైన పేర్కొన్న వివరాలు ముద్రించి ఉండాలని లేని పక్షంలో అటువంటి వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు