ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భారీగా వాహనాలు స్వాదీనం
Updated on: 2024-05-21 13:52:00

అనకాపల్లి - జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్, ఎలమంచిలి సర్కిల్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో మునగపాక ఎస్సై ప్రసాదరావు,పరవాడ సబ్ డివిజన్ సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది తో నాగులాపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భారీ ఎత్తున రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోను మొత్తం 42 వాహనాలను మునగపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సిఐ నాగులాపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.