ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కందివనం యువకుడి నిరసనకు స్పందించిన అధికారులు గ్రామలలో బెల్ట్ షాపులు ఉంటే వారిపై కఠిన చర్యలు
Updated on: 2024-05-20 14:02:00

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మే 20(పోలీస్ నిఘా):రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు గ్రామంలో విచ్చల వీడియో మద్యం అమ్మకాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశాడు.తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని,గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి పాలవుతున్నారు. పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని,ఈరోజు ఉదయం అబ్కారి స్టేషన్ నందు ఫిర్యాదు అందించాడు. నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం అని తెలిపారు. అబ్కారి అధికారి టీ.శేఖర్ మాట్లాడుతూ,, ఫరక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నిన్న నిరసన చేసిన యువకుడు నవీన్ ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి తనిఖీలు చేయగా ఇద్దరి దగ్గర మద్యం లభించినట్టు తెలిపారు. ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరి ఇండ్లలో సోదాలు చేయగా ఎలాంటి మద్యం లభించలేదు. గ్రామంలో గతంలో మద్యం అమ్మిన వారిని మరియు ఇప్పుడు దొరికిన వారిని స్టేషన్ పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. కేసు నమోదైన వారిని ఈరోజు తాసిల్దార్ దగ్గర హాజరు పరుస్తామని తెలిపారు. తాలుకలో ఏ గ్రామంలో మద్య మకాలు ఉన్న తక్షణమే అబ్కారి స్టేషన్ కు ఫిర్యాదు చేయగలరని మనవి.