ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మూడు కిలోమీటర్ల మేర తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Updated on: 2024-05-19 21:32:00

తిరుపతి:తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికిఈరోజు ఉదయం నుండి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు.మరో కొన్ని రోజుల్లో పాఠ శాలలు,కళాశాలలు ప్రారం భం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు పోటెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో శ్రీవారి సన్ని ధిలో రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్,నారాయణగిరి షెడ్లు,నిండిపోయాయి..తిరుమలలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలో మీటర్ల వరకు బారులు దీరారు.శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు,అన్నప్రసాదాలు,పాలు అందిస్తున్నట్లు చెప్పారు.టీటీడీ జేఈవో వీరబ్రహ్మం,డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్,తితిదే భద్రతాధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటు న్నారు.వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.