ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి
Updated on: 2024-05-18 17:34:00

పార్వతీపురం- సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించిన విధంగానే ఈ వి ఎమ్ ల ఓట్ల లెక్కింపు నకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.ఉద్యాన కళాశాలలోని మూడంచెల భద్రత, ఓట్ల లెక్కింపు కొరకు కల్పించవలసిన భద్రత, వసతుల ఏర్పాట్లను ఎస్ పి విక్రాంత్ పాటిల్ తో కలసి శనివారం పరిశీలించారు. అధిక సంఖ్యలో లెక్కింపు కేంద్రం బయట జనాలు చేరుకొనే అవకాశం ఉన్నందున భారీ వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించేందుకు సూచనలు చేశారు. ఎంట్రన్స్ మార్గం దగ్గర గుర్తింపు కార్డులు కలిగిన సాధారన ఏజెంట్లను మాత్రమే అనుమతించేలా పోలీస్ సిబ్బంది నియామకం, బారికేడ్లను ఏర్పాటు అంశాలపై కలెక్టర్, ఎస్ పి చర్చించారు. ఈ వి ఎమ్ ల స్ట్రాంగ్ రూమ్ భద్రతను పరిశీలించిన అనంతరం, లెక్కింపు కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలను తీసుకోవాలని అధికారులను సూచించారు. పార్లమెంట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేసి నివేదిక అందజేయాలని ఇన్చార్జి డి అర్ ఓ కేశవ నాయుడును ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీస్ పహారాను పర్యవేక్షించారు. జూన్ 4 ప తేదీ లెక్కింపు ముందు రోజు కౌంటింగ్ కేంద్రం సమీపంలోని గ్రామ ప్రజలు బయట ప్రాంతవాసులకు ఆశ్రయం కల్పించ వద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డా ఓ.దిలీప్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఓ ఎస్ డి ఆర్.వి.సూర్యనారాయణ, పార్వతీపురం అసెంబ్లీ నియోజక రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ కె.హేమలత, దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి, పాలకొండ డిఎస్పీ ఎస్.అర్. హర్షిత, జి.వి. కృష్ణా రావు, పోలీస్ భద్రతా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.