ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఓడిపోతామన్న అసూయతోనే వైసీపీ గుండాల దాడులు: సత్యకుమార్ యాదవ్
Updated on: 2024-05-15 07:01:00

కేతిరెడ్డి దౌర్జన్యాలకు ముగింపు పలకడానికే నేను వచ్చా * వైసీపీ రౌడీల దాడిలో గాయపడిన ప్రజలను పరామర్శించిన సత్యకుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలు కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడంతో తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాడని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓబుల నాయన పల్లి, చిన్నూరు బత్తలపల్లి గ్రామస్తులపై మంగళవారం వైసీపీ గుండాలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి రౌడీయిజానికి పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మవరంలో తన అధ్యాయం ముగుస్తుందని తెలుసుకున్న కేతిరెడ్డి ఇలా ప్రజలపై దాడులు చేయిస్తూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని చెప్పారు. ధర్మవరం వాసులు ఎవరు ఇకమీదట భయపడాల్సిన అవసరం లేదని, కేతిరెడ్డి రౌడీ రాజ్యానికి ముగింపు పలకడానికే తాను ఇక్కడికి వచ్చానని, అధికారంలోకి రాగానే కేతిరెడ్డి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతానన్నారు. వైసిపి గూండాలకు గడ్డుకాలం రాబోతోందని, ప్రజల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని చెప్పారు.