ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
Updated on: 2024-05-15 06:45:00

సగర భగీరథ మహర్షి మహా జ్ఞాని,పరోపకారానికి పెట్టింది పేరు అని, దీక్షకు, సహనానికి ప్రతిరూపం అని, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించాడని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ అన్నాడు.. సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, బిసి కుల సంఘ పెద్దలు, నాయకుల సమక్షంలో ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది.. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని , దానికి ప్రత్యక్ష దైవంగా భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడనీ శ్రీనివాస్ సాగర్ కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం,దేవరకద్ర బీసీ సమాజ్ నియోజక వర్గ కన్వీనర్ శేఖర్, జండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, రజక రిజర్వేషన్ జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డికె నాయి, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, ముదిరాజ్ సంఘం నాయకులు గంజి ఆంజనేయులు, రజక రిజర్వేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు శివన్న, బీసీ సమాజ్ సభ్యులు సుక్కలి భాస్కర్, మల్లేష్, కోళ్ల రాజు, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు