ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
- జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు: నారా భువనేశ్వరి
Updated on: 2024-05-08 12:04:00

రానున్న ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలి - యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు - వైసీపీ నేతల దోపిడీకి రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు - ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూములను దోచుకునేందుకే - కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మ్యానిఫెస్టో - ఓటుతో ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి కుప్పం/రామకుప్పం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు రామకుప్పం మండలంలో భువనేశ్వరి పర్యటించారు. రామకుప్పం సెంటర్లో ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ...వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అంధకారమైంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాధితులుగా మారారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడ్డారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అనేక కష్టాలను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎన్నికల రూపంలో అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరు ఓటును ఆయుధంగా మలచుకుని రాక్షస ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. జగన్ పాలనలో మహిళలకు భద్రత లేదు. గంజాయి మత్తులో మహిళలపై వైసీపీ నేతలే అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 30వేల మంది మహిళలు అదృశ్యమైతే కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైంది. ఇసుక, మద్యం, మైనింగ్, భూకబ్జాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం నుండి కంపెనీలు ప్రక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఏపీకి కొత్తగా పెట్టుబడులు ఏమీ రాలేదు. యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ పారిపోయాయి. వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప, అభివృద్ధి అంటే అర్థం తెలియదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా, సంక్షేమాన్ని అందించేలా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వాటినన్నింటినీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేస్తారు. వైసీపీ ఇచ్చిన పథకాలకంటే మెరుగైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ మ్యానిఫెస్టో కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టో ముందు తల దించక తప్పలేదు.