ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సర్వర్ పాషా
Updated on: 2024-05-08 06:32:00

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..! బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ అదే దారి షాద్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ సర్వర్ పాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్టణ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులరిజమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు మానవతావాదులు దూరంగా ఉంటారని అన్నారు. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం సీనియర్ నాయకుడు డంగు శ్రీనివాస్ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్, గిరిజన నేత శీను నాయక్ ప్రకాష్, అగ్గనూరు బసవమప్ప, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.