ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
దళితులపై వైసీపీ చిన్నచూపు : పులివర్తి నాని
Updated on: 2024-05-07 20:44:00
టీడీపీలో చేరిన దళిత నేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంకు చెందిన వైసీపీ దళిత నేత పవన్ కళ్యాణ్ (బిట్టు) ఆరోపించారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీ లావణ్య, శేఖర్ రెడ్డి ,గజేంద్ర, అమరేష్, జాను తదితరులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు స్వేచ్ఛ కరువైందన్నారు. దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దగా చేసిందన్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే చంద్రబాబు సీఎం కావాలని, పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని చెప్పారు. ప్రతిఒకరు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.