ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
భర్త గెలుపు కోసం భార్య , కుమార్తె ప్రచారం.
Updated on: 2024-05-06 16:04:00

కూటమి ఉమ్మడి అభ్యర్థి ,బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి తన కుమార్తె సంస్కృతి తో కలిసి ఈ రోజు బత్తలపల్లి లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల తేదీ సమీస్తున్న తరుణంలో వారు ప్రచార వేగాన్ని పెంచారు.ధర్మవరంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి లో ని ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ రోజు త్రివేణి ప్రచారంలో పాల్గొన్నారు.అమ్మలక్కలను కలిసి సత్యకుమార్ ను గెలిపించాలని కోరారు.ఆయా ప్రాంతాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో హారతులు ఇచ్చి మరి స్వాగతించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మహిళలతో కలిసినపుడు ఓటు బిజెపి కే వేస్తామని హామి ఇచ్చారు.అదే సమయంలో అటుగా వచ్చిన పిల్లలతో త్రివేణి ముచ్చటించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు.పెద్దవారికి నమస్కరిస్తూ ,పిల్లలను పలకరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.చివరిగా అనంతపురం రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తలపల్లి ఇన్ చార్జి లలిత్ ,కోటి బాబు ,శేషయ్య , సీనియర్ టిడిపి నేత అయ్యప్ప,రాజా రెడ్డి, మల్లేశ్ యాదవ్ ,ములగూరి ప్రసాద్ నాయుడు ,సురేంద్ర నాయుడు, శ్రీమతి అరుణా రవి తదితరులు పాల్గొన్నారు.